Oriflame, Amway, Tupperware, Modicare, RCM లాంటి కంపెనీల పేర్లెప్పుడైనా విన్నారా!

వీటి గురించి విని ఉంటే మీకు network బిజినెస్ గురించి ఎంతో కొంత తెలుసన్న మాటే.

Network marketing అనేది ఒక ప్రత్యేకమైన sales వ్యవస్థ. ఇది సంప్రదాయ sales system లకి భిన్నంగా, స్నేహితులకి, బంధువులకి, పరిచయస్తులకు, ఇతరులకి నేరుగా వస్తువులను అమ్మే ఒక Direct selling పద్ధతి. ఇప్పటివరకూ ఈ పద్ధతి వల్ల వేర్వేరు సామాజిక నేపథ్యాలున్న, వేర్వేరు ఆర్ధిక పరిస్థితుల నుండి వచ్చిన  లక్షలాది మంది స్త్రీ పురుషులకి ఆర్ధిక స్వాతంత్ర్య0 లభించింది.

ఈ Network marketing కే Multilevel marketing, Direct Selling, Relationship Marketing లాంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి.

సంప్రదాయ వ్యాపార పద్దతుల్లో, ఓ స్థిరమైన ప్రదేశంలో వ్యాపారాన్ని (shop ని) ఏర్పాటు చేసుకుని, వినియోగదారులు అక్కడికే  వచ్చేలా ఆశించడం జరుగుతుంది. దానికి భిన్నంగా Network marketingలో ఒక స్థిరమైన లొకేషన్ కి బదులు అమ్మకందారుడు కస్టమర్ ఉన్నచోటికే వెళ్లి ముఖాముఖి కలిసి వ్యాపార లావాదేవీలు జరిపే ఓ పద్ధతి ఇది.

Network marketing:

11

ప్రయోజనాలు:

రిస్కు తక్కువ: సంప్రదాయ వ్యాపారంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది. డబ్బుతో పాటు, సమయం, శ్రమ ఇవన్నీ కూడా ఖర్చవుతాయి. Network marketingలో పెట్టుబడి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఇక్కడ మీ నిజమైన పెట్టుబడి …మొదటిది మీ సమయం కాగా, రెండవది మీ యొక్క నైపుణ్యాలు (నాయకత్వ నైపుణ్యాలు, జట్టుని నడిపించడం, మీ క్రిందివారిని ఉత్సాహపరచడం …). ఇక్కడ రిస్కు ఉన్నప్పటికీ అతి తక్కువ స్థాయిలోనే ఉంటుంది.

నాణ్యత గల products: ఇది చాలా ముఖ్యమైనది. ఆర్థికావసరాల కోసమే మీరు Network marketingలోకి దిగినప్పటికీ మీరు ప్రమోట్ చేసే ఉత్పత్తుల నాణ్యతను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తూ అనేక Network marketing సంస్థలు మంచి quality గల ఉత్పత్తులను అందిస్తున్నాయి. వీటిలోనుంచి ఉత్తమ స్థాయి వాటిని మాత్రమే ఎంచుకుని ప్రమోట్ చేయగలిగితే మార్కెట్లో మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. అలా జరగాలంటే ఉత్పత్తులను ముందుగా మీరు స్వయంగా వాడి వాటి నాణ్యతను స్వయంగా పరీక్షించి నిర్ధారించుకున్న తరువాతే ప్రమోట్ చేసినట్లయితే ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సాఫీగా మీ వ్యాపారం ముందుకి సాగుతుంది. దీనికి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు.

ఇందులో Network marketing లేనట్లయితే నేను ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తానా?

ఈ ఉత్పత్తులని ప్రమోట్ చేయడం ద్వారా నేను నా కస్టమర్లకి ఏదైనా నిజమైన ప్రయోజనాన్ని అందించగలుగుతున్నానా?

నిరంతర వ్యాపారం:

కొన్ని ఉత్పత్తులు ఒకసారి కొనుగోలు చేస్తే మళ్ళీ చాలాకాలం పాటు కొనాల్సిన అవసరం ఉండదు (ఉదాహరణకి టీవీ, బైక్ ). మరికొన్ని వస్తువులు తరచుగా కొనుగోలు చేయాల్సివస్తుంది ( కిరాణా సరుకులు, Healthcare ఉత్పత్తులు). Network marketingలో ఇలా మళ్ళీ మళ్ళీ కొనాల్సిన వస్తువులు ఉంటే వాటిని ఎంచుకోవడం ఎంతో మంచిది. products quality బాగా ఉండి, ప్రతీ నెలా క్రమం తప్పకుండా purchase చేసే కస్టమర్లు ఉండడం వల్ల మీకు స్థిరమైన ఆదాయం (మొదట్లో తక్కువ అయినా సరే) రూపొందుతుంది.

12

అపరిమితమైన అభివృద్ధి (unlimited growth): Network marketingలో మీ సంపాదనకి upper limit అంటూ ఉండదు. మీరెంత కష్టపడితే అంత ప్రతిఫలం మీకళ్ళ ముందే కనబడుతుంది.

మీకు మీరే boss :

ఠంచనుగా పొద్దున్న 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు మీకిష్టం ఉన్నా లేకున్నా ఎవరో చెప్పిన పనులన్నీ చేయడం మీకస్సలు ఇష్టం లేదా ? అయితే network marketing మీకు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ మీకంటూ boss ఎవరూ ఉండరు, మీకు మీరే boss. రోజులో ఏ సమయంలో పని చేయాలో మీరే స్వయంగా నిర్దేశించుకోవచ్చు.

పార్ట్ టైం ఆదాయం: మీ ఉద్యోగాన్ని వొదిలిపెట్టి దీనికోసం ప్రత్యేకంగా full time పని చేయాల్సిన అవసరం లేదు. మీకున్న ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో network marketing కోసం కాస్త సమయాన్ని కేటాయించవచ్చు. కొంత ఆదాయం సంపాదించిన తరువాత దేనిపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలన్న విషయం ఆలోచించుకోవచ్చు.

Residual income: సంప్రదాయ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పని చేసినన్ని రోజులు మాత్రమె ఆదాయం లభిస్తుంది. ఈ సోమ్ములోనుండి ఖర్చులకి కొంత పోనూ మిగతా డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకుని వృద్ధాప్యంలో అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. అంటే పని చేస్తేనే ఆదాయం లభిస్తుందన్న మాట. పని చేయడం ఆపివేసిన మరుక్షణమే మీకు ఆదాయం రావడం కూడా ఆగిపోతుందన్నమాట. అలా కాకుండా కొంత కాలం పనిచేసిన తరువాత పని చేయడం ఆపివేసినా కూడా ఆదాయం లభించే మార్గం ఉంటే ఎంత బాగుంటుంది కదూ ! అలా లభించే ఆదాయాన్నే residual income అంటారు. network marketingలో కూడా మీరు కొన్ని రోజులు శ్రమించి ఓ స్థాయికి చేరుకున్న తరువాత అప్పుడు మీకు residual income రావడం మొదలవుతుంది. మొదట్లో ఇది కొద్ది మొత్తమే కావొచ్చు కానీ మరింత కష్టపడా కొద్దీ ఈ మొత్తం కూడా పెరిగే అవకాశముంది. అయితే ఇలా నిరంతర ఆదాయం లభించాలంటే మీ teamని కూడా ఉత్సాహపరుస్తూ ఓ స్థాయికి తీసుకెళ్ళాల్సి ఉంటుందని మరిచిపోవద్దు.

residual incomeకి మరికొన్ని ఉదాహరణలు

1.పుస్తక రచన (writer)

2.website నిర్వహణలో Ads ద్వారా వచ్చే ఆదాయం.

3.ఇంటి అద్దెలపై వచ్చే ఆదాయం.

వ్యక్తిత్వ వికాసం:

13

Network marketingలో మీ products ని అమ్మడానికై మీరు కొత్త వ్యక్తులను కలిసి మీ ఉత్పత్తుల గురించి వారికి వివరించాల్సి ఉంటుంది. దీనివల్ల మీ సోషల్ skills అద్బుతంగా మెరుగుపడతాయి. ప్రతీరోజు ఓ ఛాలెంజ్ లాగా అనిపిస్తూ ఆ ఛాలెంజ్ లను అధిగమించినపుడు గొప్ప సక్సెస్ సాధించామన్న గర్వం కలుగుతూంటుంది. వేరే ఇతర పనుల్లో ఇలాంటి సంతృప్తి ఎప్పుడోగాని కలగదు. క్రమేణా మీ communication skills అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. పరోక్షంగా, మీ వ్యక్తిత్వం మరింత తీర్చిదిద్దబడుతుంది. వీటన్నిటితో పాటు వ్యాపార కిటుకులు, మెళుకువలు వంటపడుతాయి. దానివల్ల మరేదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలన్నీ మీరు కలిగి ఉంటారు.

ఇబ్బందులు:

network marketing పై ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం ఒక పెద్ద మైనస్ point. పిరమిడ్ స్కీములు, సర్క్యులేషన్ స్కీములు, పొంజి స్కీముల పేరిట ఈ రకమైన బిజినెస్ లను పిలవడం జరుగుతున్నది. అయితే సామాన్య ప్రజల్లో ఈ రకమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణం లేకపోలేదు. కొన్ని కంపెనీలు network marketing పేరుతో అనేక అనైతిక విధానాలను అనుసరిస్తూ, ప్రోత్సహించడం చేసాయి. సరయిన నియమ నిబంధనలు లేకపోవడం, ఆజమాయిషీ, నియంత్రణ లోపించడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా అర్థం చేసుకోకపోవడం: join అవుతున్న చాలామందికి, తాము కూడా కష్టపడితేనే ఫలితాలు లభిస్తాయన్న విషయం తెలీదు. ఈ విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా sponsorలు దాచిపెట్టి “నీకేం ఇబ్బంది లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అదంతా నేను చూసుకుంటాను.” లాంటి మాటలతో మభ్యపెట్టడం జరుగుతున్నది. వీళ్ళ మాటలు విన్నవారు “కేవలం జాయిన్ అయిపోతే చాలు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు” అన్న భ్రమలోనే ఉండి చివరకు విఫలమవుతారు.

Quality products తక్కువ: network marketing కంపెనీల్లో ఎక్కువ నాణ్యత లేని నాసిరకం ఉత్పత్తులనే ప్రమోట్ చేస్తున్నాయి. సరుకుల qualityని పెంచడానికి బదులుగా ఇవి marketing వ్యూహాలపైనే దృష్టి పెడుతున్నాయి.

Network marketing ఎలా పని చేస్తుంది?

16

మీరు ఒక స్వతంత్ర sales executiveలాగా స్వయంగా పనిచేస్తూ, మీకంటూ ఓ teamని (downline) ఏర్పరచుకుని, వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ, అమ్మకాలు పెంచుకుంటూ సంస్థకి లాభాలను తీసుకొస్తూ మీరు కూడా తగిన ప్రయోజనాలు పొందడం.

జాయిన్ అవ్వడం:  ఇదివరకే పని చేస్తున్న ఒక డిస్ట్రిబ్యూటర్ మిమ్మల్ని సంప్రదించడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇలా జాయిన్ అవ్వడం ద్వారా ఆ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ అమ్మకాలు పెంచే బాధ్యతను మీరు స్వీకరిస్తారు. దీనికి అవసరమైన నైపుణ్యాలను, శిక్షణను, సమాచారాన్ని మీ డిస్ట్రిబ్యూటర్ (sponsor) మీకందిస్తాడు. ఈ joining కోసం మీరు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. దానికి ప్రతిఫలంగా మీకు ఆ product అందజేయబడుతుంది.

Sales: Join కావడానికి ముందుగానే లేక join అయిన తరువాత గానీ మీరు ఆ product ను వినియోగించి దాని quality పట్ల సంతృప్తి చెందుతారు. ఇప్పుడు మీకు నచ్చిన ఈ product గురించి  ఇతరులకు  చెప్పి, ఒకవేళ వారు కూడా ఈ product ను కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, వారికి ఆ product ని అందించి, ప్రతిఫలంగా కంపెనీ నుండి కొంత ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఇలా మీరు ఎంత ఎక్కువ మందికి productలు అమ్మగలిగితే అంత ఎక్కువగా ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

Networkని నిర్మించడం:

14

పైన చెప్పిన పద్దతిలో ఎన్ని రోజుల వరకు కష్టపడతారో అప్పటివరకు మాత్రమే లాభాలు ఆర్జించగలుగుతారు. పనిచేయడం ఆపివేయగానే ఆటోమేటిక్ గా సంపాదన కూడా ఆగిపోతుంది. మరి అప్పుడెలా?

network marketing అనేది ఒక residual income అని చెప్పుకున్నాం. అంటే పని చేయడం ఆపివేసినా కూడా ఇంకా ఆదాయం వస్తూనే ఉంటుంది. దాని వెనక ఉన్న రహస్యమే network నిర్మాణం.

మీ క్రింద ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేసే, చురుకైన వ్యక్తులతో ఓ networkని గనక నిర్మించినట్లయితే కొంతకాలం తరువాత మీరు పనిచేయకపోయినా కూడా మీకు నిరంతరం ఆదాయం లభిస్తూనే ఉంటుంది.

మీ network లోని వ్యక్తులు పనిచేసి అమ్మకాలు పూర్తి చేసినపుడు వారి ఆదాయంలోంచి స్వల్ప మొత్తం మీకు కూడా చెల్లించబడుతుంది. ఇలాంటి వ్యక్తులు మీ network లో ఎక్కువమంది ఉన్నప్పుడు వారందరూ పని చేస్తూన్నప్పుడు మీకు ఎక్కువ స్థాయిలో ఆదాయం లభిస్తుంది. ఎంత భాగం లభిస్తుందనేది ఒక్కో network కి ఒక్కో రకంగా ఉంటుంది.

ఈ వ్యవహారమంతా చూడటానికి సులభంగానే అనిపించినప్పటికీ ఒక పటిష్టమైన network ని నిర్మించాలంటే మీ విలువైన సమయాన్ని చాలావరకు వెచ్చించాల్సి ఉంటుంది. అపుడే మంచి network నిర్మింపబడుతుంది. అంకితభావంతో కష్టపడి లక్షాధికారులయినవారిని ఎందరినో మీరు చూడవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారిలో ప్రముఖుల జాబితా ఈ లింకులో మీరు చూడవచ్చు.

http://www.vineetgupta.net/list-top-100-earners-network-marketing-2012/

దీనికి భిన్నంగా కొంత ప్రయత్నం చేసి ఫలితం లభించక, మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఈ network marketing పద్ధతినే విమర్శించేవారు కూడా కోకొల్లలుగా కనిపిస్తారు. నిజానికి ఇలాంటివారే ఎక్కువగా కనిపిస్తారు. ఒక సంస్థలో చేరి ఆ తరువాత తీరిగ్గా బాధ పడకుండా ఉండాలంటే ….

15

జాయిన్ అయ్యే ముందుగానే product ని ఉపయోగించి, పరీక్షించి చూడాలి. మీకు నమ్మకం, సంతృప్తి లేని product గురించి మీరు ఇతరులకి వివరించలేరు. మీకు నచ్చిన దాని గురించి చెప్పేటపుడు ఆటోమేటిక్ గా మీ స్వరంలో నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఎదుటివారికి కనిపిస్తాయి.

ముందుగా మీరు పెట్టే పెట్టుబడి కోల్పోయినా కూడా నాకు పెద్దగా నష్టం లేదు అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి. మీకు ఏమాత్రం ఈ బిజినెస్ గురించి తెలీకపోతే ఒకేసారి అధికమొత్తం అవసరమయ్యే networkలో అడుగుపెట్టకండి.

online లో కంపెనీ గురించి రివ్యూలు చదవండి. వాటిలో పాజిటివ్, నెగటివ్, మిశ్రమ …..ఇలా అన్నిరకాల అభిప్రాయాలుండవచ్చు. వాటన్నింటినీ చదివి ఓ నిర్ణయానికి రండి.

వీటి ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని మీ sponsor ని నిస్సంకోచంగా అడగవచ్చు. వారు చెప్పే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్లయితే సందేహించాల్సిందే.

చాలామంది ఔత్సాహికులు ఈ network ల్లోకి చేరడం, కొద్దికాలంలోనే విఫలమై ఈ రంగంనుండి నిష్క్రమించడం జరుగుతున్నది. ఈ రంగాన్ని వదిలివేయడానికి ఎన్నో కారణాలుండవచ్చు. వాటిని విశ్లేషిస్తే ఈ క్రిందివి ప్రదానమైనవిగా భావించవచ్చు.

1.పొరపాటు అంచనాలు: ఈ బిజినెస్ ను సరిగ్గా అర్థం చేసుకోక పోవడం వల్ల, కొత్తగా చేరేవారిలో అనేక తప్పుడు అంచనాలు, భావనలు ఏర్పడుతాయి. ఉదాహరణకి….

  • ఈ బిజినెస్ లో విజయం సాధించడం చాలా సులభం.
  • నా పని కేవలం ఇద్దరినీ/ముగ్గురిని recruit చేయడమే. అక్కడితో నా పని అయిపోతుంది. మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు.
  • నా ఫ్రెండ్స్ అందరూ ఎగిరి గంతేసి ఒప్పుకుని, join అవుతారు.
  • మొదటి నెలలో x ఆదాయం, రెండో నెలలో Y ఆదాయం గ్యారంటీ. దీంతో ఆరు నెలల్లోగా లక్షాధికారి అయిపోవడం ఖాయం

వాస్తవంగా ఈ అంచనాలు నెరవేరడం అటుంచి, కనీసం దగ్గరికి కూడా చేరుకోలేకపోవడం వల్ల అసంతృప్తి మొదలవుతుంది.

 

 

Advertisements